బడ్జెట్ ముఖ్యంశాలు… గ్రామీణాభివృద్ధికి రూ.17,109.04 కోట్లు

AP-Budget- session 2022

అమరావతి: ఏపీ ప్రభుత్వం బడ్జెట్ లోనే లోనే అత్యధిక మొత్తాన్ని ఆర్థిక సేవల రంగానికి కేటాయించింది. రూ.69,306.74 కోట్లను కేటాయించింది. అది బడ్జెట్ లో 27.5 శాతం. నీటిపారుదల, వరద నియంత్రణ వ్యవస్థలకు రూ.11,482.37 కోట్లను కేటాయించింది. గ్రామీణాభివృద్ధి కోసం రూ.17,109.04 కోట్ల కేటాయింపులను చేసింది.

బడ్జెట్ హైలైట్స్:

.ఆర్థిక శాఖకు రూ.58,583.61 కోట్లు
.పట్టణాభివృద్ధి కోసం రూ.8,796 కోట్లు
.పౌర సరఫరాల శాఖకు రూ.3,719.24 కోట్లు
.జీఏడీకి రూ.998.55 కోట్లు
.సచివాలయంకు రూ.3,396.25 కోట్లు
.వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,630.10 కోట్లు
.జనరల్ ఎకో సర్వీసెస్ కోసం రూ.4,420.07 కోట్లు
.రవాణా శాఖకు రూ.9,617.15 కోట్లు
.సైన్స్ అండ్ టెక్నాలజీకి రూ. 11.78 కోట్లు
.గృహ నిర్మాణానికి రూ.4,791.69 కోట్లు
.కార్మికులు, ఉపాధి కోసం రూ.1,033.86 కోట్లు
.సామాజిక భద్రత, సంక్షేమంకు రూ.4,331.85 కోట్లు
.సాంకేతిక విద్య కోసం రూ.413.5 కోట్లు
.తాగునీళ్లు, పారిశుద్ధ్యానికి రూ.2,133.63 కోట్లు
.సంక్షేమం కోసం రూ.45,955 కోట్లు.
.వైఎఎస్సార్ పెన్షన్ కానుక కోసం రూ.18 వేల కోట్లు
.వైఎస్సార్ రైతు భరోసాకు రూ.3,900 కోట్లు
.రైతులకు విత్తన సరఫరా కోసం రూ.200 కోట్లు
.జీరో బేస్డ్ వ్యవసాయానికి రూ.87.27 కోట్లు
.వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు రూ.1,802.04 కోట్లు
.వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్ కోసం రూ.50 కోట్లు
.ప్రకృతి వైపరీత్యాల నిధికి రూ.2 వేల కోట్లు
.రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.1,750 కోట్లు
.కృషియోన్నతికి రూ.760 కోట్లు
.ధరల స్థిరీకరణ కోసం రూ.500 కోట్లు
.జగనన్న విద్యా కానుకకు రూ.2,500 కోట్లు
.జగనన్న వసతి దీవెనకు రూ.2,083.32 కోట్లు
.డ్వాక్రా సంఘాల (రూరల్) వడ్డీలేని రుణాలకు రూ.600 కోట్లు
.డ్వాక్రా సంఘాలు(పట్టణ) వడ్డీలేని రుణాలకు రూ.200 కోట్లు
.వడ్డీలేని రైతు రుణాలకు రూ.500 కోట్లు

వివిధ సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చింది. కాపుల సంక్షేమం కోసం రూ.3,531.68 కోట్లను కేటాయించింది. రెడ్డి సంక్షేమం కార్పొరేషన్ కు రూ.3,088.99 కోట్లు, కమ్మ సంక్షేమ కార్పొరేషన్ కు రూ.1,899.74 కోట్లను కేటాయించింది. వైఎస్సార్ కాపు నేస్తం కింద రూ.500 కోట్ల కేటాయింపులను చేసింది. అమ్మ ఒడి కోసం రూ.6,500 కోట్లు, వైఎస్సార్ చేయూతకు రూ.4,235 కోట్లను బడ్జెట్ లో కేటాయించింది.

.క్రిస్టియన్ కార్పొరేషన్ కు రూ.113.4 కోట్లు
.బ్రాహ్మణ కార్పొరేషన్ కోసం రూ.455.23 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అందులో అర్చకుల కోసం రూ.122 .కోట్ల కేటాయింపులను చేసింది.
.వైశ్య సంక్షేమ కార్పొరేషన్ కు రూ.915.49 కోట్లు
.క్షత్రియ సంక్షేమ కార్పొరేషన్ కు రూ.314.02 కోట్లు
.ఈబీసీల సంక్షేమానికి రూ.139.18 కోట్లు
.బీసీ కార్పొరేషన్ కు రూ.6,345.82 కోట్లు
.వైఎస్సార్ వాహనమిత్రకు రూ.260 కోట్లు
.నేతన్న నేస్తానికి రూ.199.99 కోట్లు
.మత్స్యకార భరోసా కోసం రూ.120.49 కోట్లు
.మత్స్యకారుల డీజిల్ సబ్సిడీకి రూ.50 కోట్లు

ఆరోగ్య రంగంలో వివిధ పథకాలకు కేటాయింపులివీ..

.వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.2 వేల కోట్లు
.ఆసుపత్రుల్లో నాడు నేడుకు రూ.1,603 కోట్లు
.నేషనల్ హెల్త్ మిషన్ కు రూ.2,462.03 కోట్లు
.మెడికల్ కాలేజీల్లో పనులకు రూ.753.84 కోట్లు
.కొత్త మెడికల్ కాలేజీ ఆసుపత్రుల కోసం రూ.320 కోట్లు
.ఇప్పటికే ఉన్న ఆసుపత్రులను కాలేజీలగానూ మార్చేందుకు రూ.250.45 కోట్లు
.వైఎస్సార్ ఆరోగ్య ఆసరాకు రూ.300 కోట్లు
.గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు రూ.170 కోట్లు
.104 సేవలకు రూ.140 కోట్లు
.108 సర్వీసులకు రూ. 133.19 కోట్లు
.ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంపునకు రూ.100 కోట్లు
.ఎన్ హెచ్ఎం మౌలిక వసతులకు రూ.695.88 కోట్లు
.ఆశా వర్కర్లకు గౌరవ వేతనం కోసం రూ.343.97 కోట్లు
.కుటుంబ సంక్షేమ కేంద్రాలకు రూ.218 కోట్లు
.ఆయుష్మాన్ భారత్ మౌలిక వసతుల మిషన్ కు రూ.250 కోట్లు

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/