భాగ్యనగరం లో భారీ వర్షం..నగరవాసుల అవస్థలు

Heavy Rain in Hyderabad
Heavy Rain in Hyderabad

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. మరో నాల్గు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక నిన్నటి నుండే హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి చాలా చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పాడింది. వాననాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పాఠశాల, కాలేజీ, కార్యాలయాలకు వెళ్లే వారు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. రోడ్లు పై నీరు చేరడం వాహనాలు మెల్లగా కదులుతున్నాయి.

నగరంలో అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, పంజాగుట్టా, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, కొండాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, బీఎన్‌రెడ్డి, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లిలో ఆగకుండా వర్షం కురుస్తోంది. మరోవైపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

అదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, కామారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం నాడు 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించగా.. బుధవారం నాడు 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. బుధవారం నాడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఇక హైదరబాద్‌లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు.