టీడీపీ మహానాడు కు భారీ పోలీస్ భద్రత..

టీడీపీ మహానాడు వేడుకలు నేడు , రేపు రాజమహేంద్రవరం లో అట్టహాసంగా జరపబోతున్నారు. ఈ క్రమంలో ఈ మహానాడు వేడుకలకు పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. దాదాపు 1,700 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పటు చేసింది. పార్టీ అధినేత చంద్రబాబు ఈ వేడుకను ప్రారంభించనున్నారు. రాజమండ్రి శివార్లలోని వేమగిరి వద్ద 55 ఎకరాల విశాలమైన మైదానంలో ఈ వేడకను నిర్వహిస్తున్నారు. మహానాడు జరుగుతున్న ప్రాంగణానికి ఎన్టీఆర్ ప్రాంగణంగా పేరు పెట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచి 15 వేల మంది ప్రతినిధులను ప్రత్యక్షంగా ఆహ్వానం అందింది. తొలిరోజు 30 నుంచి 40 వేల మంది వరకు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మహానాడుకు 1,700 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధినేత చంద్రబాబు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పిస్తారు. అనంతరం ప్రతినిధుల రిజిస్టర్ లో సంతకం చేస్తారు. ఆ తర్వాత నేతలంగా ఆయనను అనుసరిస్తారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, మహానాడును ప్రారంభిస్తారు.

ఇక మహానాడు వేడుక మొదటిసారి1982 లో హైదరాబాద్ లో జరిగింది. ఆ తర్వాత 1983 – విజయవాడ, 1984 – వైజాగ్ , 1986, 1987 – హైదరాబాద్, 1988 – విజయవాడ, 1990 నుంచి 1994 మధ్య కాలంలో 4 మహానాడులు – హైదరాబాద్ ,1998, 1999 – హైదరాబాద్ ,2000 – విజయవాడ , 2001 – విశాఖపట్నం, 2022 – వరంగల్, 2003 – తిరుపతి, 2004, 2005 – హైదరాబాద్, 2006 – రాజమండ్రి, 2007 – తిరుపతి, 2009 నుంచి 2015 వరకు – హైదరాబాద్, 2016 – తిరుపతి, 2017 – విశాఖపట్నం, 2018 – విజయవాడ, 2020, 2021 – కరోనా కారణంగా ఆన్ లైన్ లో మహానాడు నిర్వహణ, 2022 – ఒంగోలు, ప్రస్తుతం 2023 – రాజమండ్రి లో జరుగుతుంది.