పెళ్లి ఖర్చు రూ.100 కోట్లా?
విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ వివాహం డిసెంబర్ లోనే!

విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ వివాహం వచ్చే నెలలో జరగనున్న నేపథ్యంలో పలు సెలబ్రిటీ వెడ్డింగ్స్ కి సంబంధించిన పెళ్లి ఖర్చు వివరాలపై ఇపుడు చర్చ సాగుతోంది. రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ పోర్ట్ బార్వారా వేదిక గా వీరి వివాహం వైభవంగా జరగనుంది. ఇరు కుటుంబ సభ్యులు.. అతికొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు.. సన్నిహితులు సమక్షంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పెళ్లికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? అన్నది హాజరయ్యే అతిథుల్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తికి ఒక రాత్రి ఖర్చు అక్షరాల రూ 77,000 ఖర్చు అవుతుంది. మరి విక్కీక్యాట్ వివాహానికి ఎంత ఖర్చు అవుతుందన్నది వచ్చేవారి సంఖ్య ను బట్టి లెక్క తేలాల్సి ఉంటుంది. మరి విక్కీక్యాట్ ల వివాహానికి ఖర్చు రూ100 కోట్లు పైగా ఖర్చు అవుతుందా అంటూ చర్చ సాగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/