జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం

హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 42,500 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. దీంతో అధికారులు 29,051 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం వైపు 25,589 నీరు వెళ్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 317.010 మీటర్లు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.749 టీఎంసీలు. జలాశయంలో ఇప్పుడు 6.657 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/