నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ

handrababu-naidu

అమరావతిః నేడు సుప్రీంకోర్టులో స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరుగనుంది. ఏపీ స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో slp వేశారు సిఐడి అధికారులు. ఇక ఈ కేసును జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించనుంది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో తమ వాదనలు,ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్ లో పేర్కొన్నారు సీఐడీ అధికారులు. అటు జనవరి 19న విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలుకు సమయం కావాలని కోరారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. ఇరు పక్షాలూ తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించిన సుప్రీం ధర్మాసనం…నేడు స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరుగనుంది.