వినియోగదారులకు షాక్ : గ్యాస్ సిలిండర్ ఫై​ ధర రూ. 100.50 పెంపు

చమురు సంస్థలు మరోసారి గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఫై ధర రూ. 100.50 పెంచింది. ఈ ధరలు నేటినుంచే(బుధవారం) అమల్లోకి వచ్చాయని పేర్కొన్నాయి. దీంతో ప్రస్తుతం 19కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,101కు చేరింది. సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయని వాణిజ్య సంస్థలు తెలిపాయి.

14.2కేజీ, 5కేజీ, 10కేజీ కమర్షియల్ సిలిండర్​ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపింది. గత నెల 1న 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 266 పెంచింది. అంత ముందు నెల సెప్టెంబరు 1న రూ. 75 పెంచాయి. ఇలా ప్రతి నెల పెంచుకుంటూ పోతుండడం తో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,278గా నమోదైంది. కాగా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రం ఆయిల్ కంపెనీలు కనికరం చూపించాయి. డొమెస్టిక్ సిలిండర్ల ధరను కంపెనీలు పెంచకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.