లారీని ఢీకొని యాత్రికుల బస్సు దగ్ధం

Bus Accident
Bus Accident

పైడిభీమవరం: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పరిశాం వద్ద మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు… అదుపు తప్పి…డివైడర్ ఎక్కింది. అటువైపు ఆగివున్న అమ్మోనియం లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. యాత్రికుల బస్సు పూరి నుంచి రామేశ్వరం వెళ్తుండగా పైడిభీమవరం వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది యాత్రికులు బస్సులో ఉన్నట్లు సమాచారం. బాధితులు ఉత్తరాఖండ్‌కు చెందిన అల్వాని వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/