మరికాసేపట్లో ఏపీ కేబినేట్ సమావేశం..

సీఎం జగన్ అధ్యక్షతన మరికాసేపట్లో ఏపీ కేబినేట్ సమావేశం మొదలుకానుంది. ముఖ్యంగా దళితులకు భూ పంపిణీపై కెబినెట్లో చర్చించనున్నారు. ఇప్పటికే దళితులకు భూ పంపిణీపై అధికారులు కసరత్తు పూర్తి చేసారు. అలాగే, పాఠశాలల్లో టోఫెల్ శిక్షణ కొసం చేసుకున్న ఒప్పందాలను అమోదించనుంది మంత్రివర్గం. 15 వేల డీఎస్సీ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనల పై కెబినెట్లో చర్చ చేయనున్నారు. నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది జగన్ సర్కార్. బేతంచర్ల, గుంతకల్, మైదుకూరు లలో పాలిటెక్నిక్ కళాశాలలు ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. ఎస్సీఆర్టీలో ఖాళీల భర్తీకి అనుమతి ఇవ్వనుంది.

అదే విధంగా ముఖ్యమంత్రి , మంత్రుల జిల్లా పర్యటనలు పై క్లారిటి వచ్చే ఛాన్స్ ఉంది. జగన్ సర్కార్ అమరావతి ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాన్ని సవాల్ గా తీసుకుంది. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్దలం కేటాయింపు, ఆ తరువాత కూడ ఇంటి నిర్మణానికి అవసరం అయిన అన్ని సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది. ఇంటి స్దలాల కేటాయింపులకు సంబంధించిన వ్యవహరంలో కోర్టులో ఇబ్బందులు లేకుండా.. తుది తీర్పును బట్టి లబ్దిదారులకు యాజమాన్య హక్కులు కల్పించే షరతుతో ముఖ్యమంత్రి రాజదాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్దలాన్ని కేటాయించారు.

ఎన్నికలకు మరో ఎనిమిది నెలలు మాత్రమే ఉన్నందున రాజధాని ప్రాంతంలో పేదలకు సొంతింటి కల ను నెరవేర్చేందుకు అవసరం అయిన అన్ని సదుపాయాలు కల్పించి ఇంటి నిర్మాణాన్ని కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్నారు.