ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు

ఢిల్లీ వాసుల్లో ధైర్యం నింపిన అజిత్‌ దోవల్‌

ajit doval
ajit doval

న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. అల్లర్ల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తూ… స్థానిక ప్రజలతో మాట్లాడారు. అల్లర్లతో దెబ్బతిన్న ప్రాంతాల్లో కాలినడకన తిరుగుతూ, స్థానికుల్లో ధైర్యం నింపారు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని దోవల్ స్థానికుల భుజాలను తడుతూ వారికి ధైర్యం నూరిపోశారు. అజిత్ దోవల్ పర్యటనతో స్థానికుల్లో భయాందోళనలు తొలిగి, వారిలో ఆత్మ స్థైర్యం నిండుతుందని పోలీసు వర్గాలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసిన సందర్భంలో కూడా అజిత్ దోవల్ ఇలాగే కశ్మీర్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. అంతేకాకుండా స్థానికులతో, విధుల్లో ఉన్న పోలీసు అధికారులతో మాట్లాడుతూ… కశ్మీరీ ప్రజల్లో ధైర్యం నూరిపోశారు. ఈ ఘటనను చూసిన స్థానికులు అజిత్ దోవల్ జిందాబాద్… జిందాబాద్… అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం గమనార్హం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/