చిన్న పొరపాట్లు… పెద్ద అనారోగ్యం!

ఆరోగ్య సంరక్షణ

ఉరుకుల పరుగుల జీవితంలోపడి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. వీటితో జ్ఞాపక శక్తి క్రమంగా తగ్గిపోవటం , మెదడు కణజాలం దెబ్బతినటం, అల్జీమర్ వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కొన్ని అలవాట్ల వలన మెదడు, శరీరం రెండూ దెబ్బతినే ప్రమాదం ఉంది . మరి ఆ అలవాట్లు ఏంటో.. వాటిని ఎలా నియంత్రించుకోవాలో చూద్దాం ..


ఆహారం :

మనలో చాలామంది ఉదయం టిఫిన్ తినరు.. ఇలా చేయటం వలన రక్తంలో చెక్కెర స్థాయిలు పడిపోతాయి. దీంతో మెదడుకు కావాల్సిన పోషకాలు అందవు.. ఫలితంగా, మెదడు అభివృద్ధి, అది చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.

తీపి:
కొందరు తీపి పదార్ధాలు అతిగా తింటుంటారు. అధికంగా తీపి తింటే మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది.. ఊబకాయం, మధుమేహం, చర్మ సంబంధిత , ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

శారీరక శ్రమ:
ఒకే చోట ఎక్కువ గంటలు కూర్చొని ఉండటం వలన మెదడు స్తబ్దుగా మారిపోతుంది.. ఒత్తిడి పెరుగుతుంది.. వీటిని ఆపాలంటే రోజూ క్రమం తప్పకుండ వ్యాయామం చేయాలి. దీంతో మెదడు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.. మెదడు కణాలు ఆరోగ్యంగా ఉన్నపుడు అది చక్కగా పనిచేస్తుంది.

నిద్రలేమి:
రాత్రి నిద్ర పోయాక మన శరీరం మరమత్తులు చేసుకుంటుందని నిపుణులు చెబుతారు. దీంతో తర్వాతరోజు మెదడు బాగా పనిచేస్తుంది. ఆందోళనలు తగ్గుతాయి నిద్రలేమితో అలసిపోతారు. బలహీలపడతారు.. రోజంతా నిరుత్సాహంగా ఉంటారు.. చేసే పనిపై శ్రద్ద పెట్టలేరు . అంతేకాదు నిద్రలేమి వలన మెదడు, గుండెకు సంబంధించిన జబ్బులు వస్తాయి. కాబట్టి రోజుకు 7,8 గంటల నిద్ర పోవాల్సిందే.

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/