పిల్లల్లో భయాలు

Fear in children-

అయిదేళ్లలోపు పిల్లల్లో కొందరికి మాటలు రావడం ఆలస్యమవుతుంది. మాట్లాడే తీరులో తేడా ఉంటుంది. ఈ వయసులో కొంత మంది పిల్లల్లో కొన్ని రకాల భయాలుంటాయి. ఇలాంటి భయం ఉన్న పిల్లలు కొత్తవారితో మాట్లాడటానికి భయపడతారు. అమ్మానాన్నలను వదిలి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లటానికి కూడా భయపడతారు. పిల్లల మాన సిక ఎదుగుదల మెడదు అభివృద్ధిని బట్టి ఉంటుంది. ఆ ప్రకారంగా ఉంటే మామూలుగా మాట్లాడతారు. ఎదుగుదల ఉండి మాట తడబడినా, ఆలస్యంగా మాట్లాడుతున్న స్థితిని స్పెసిఫిక్‌ స్పీచ్‌ డిలే అంటారు. పిల్లల్లో ఎదుగుదల సాధారణంగానే ఉన్నా విషయాన్ని విని అర్ధం చేసుకుని తిరిగి సమాధానం చెప్పడంలో విఫల మవుతుంటారు. దాంతో మనం చెప్పిన వాటినే తిరిగి చెబుతుంటారు. కొందరు పిల్లల్లో జ్ఞానేంద్రియాల సమస్య కూడా ఉంటుంది. అందుకే వారు ఎక్కువ శబ్దాలు వినలేక చెవులు మూసుకుంటుంటారు. స్కూల్లో తోటి పిల్లలు చేసే అల్లరిని భరించలేకపోతారు. అటువంటప్పుడు వారిని మానసిక వైదులకు చూపించడం మంచిది. పుట్టినప్పటి నుండి ఆలస్యంగా మాట్లాడటం, పదాలు తక్కువగా వాడటం, తన పర అనే తారతమ్యం లేకపోవడం, చెప్పిందే చెప్పడం వంటివి చేస్తున్నప్పుడు వైద్యులు సంప్రదిస్తే మంచిది. అలాగే జ్ఞానేంద్రియా సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కొన్ని పరీక్షలు చేస్తే వారిలో మార్పు వచ్చే అవకాశముంటుంది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/