రిషబ్ పంత్ ను కాపాడిన బస్ డ్రైవర్ కు ప్రశంసా పత్రం, షీల్డ్ అందజేత

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. పంత్ కేష్మంగా బయటపడడానికి సాయం చేసిన బస్సు డ్రైవర్ ను రోడ్డు హర్యానా రోడ్ వేస్ అధికారులు ప్రశంస పత్రాలతో సత్కరించారు.

ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఉత్తరాఖండ్ రూర్కీలోని నర్సన్ సరిహద్దులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కార్ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పంత్‌కు గాయాలు కావడంతో.. హుటాహుటిన స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుండి ఢిల్లీకి తరలించారు. ఈ ప్రమాదంలో పంత్ తలకు, మోకాలికి గాయాలయ్యాయి. వీపు భాగం కాలింది. కాలికి ఫ్రాక్చర్ అయింది. డ్రైవ్ చేస్తున్న సమయంలో ఒక క్షణం నిద్రలోకి జారుకోవడం వల్లే ప్రమాదం సంభవించిందని పోలీసులు భావించారు.

పంత్ కారు వెనుకే వస్తున్న హర్యానా రాష్ట్ర రోడ్ వేస్ బస్సు డ్రైవర్.. కారు ప్రమాదాన్ని గమనించి వెంటనే బస్సు నిలిపివేశాడు. కండక్టర్ తో కలసి కిందకు దిగి వెళ్లి చూడగా, ఓ వ్యక్తి కారు డోర్ విండోలో ఇరుక్కుని ఉండడం చూసి బయటకు తీసి రక్షించారు. ఆలా రక్షించడం వల్లే పంత్ పెనుప్రమాదం నుండి బయటపడ్డారని చెప్పొచ్చు. పంత్ ను కాపాడిన బస్సు డ్రైవర్ సుశీల్, కండక్టర్ పరమ్ జీత్ కు హర్యానా రోడ్ వేస్ అధికారులు ప్రశంసా పత్రాలు, షీల్డ్ ను బహూకరించి, వారిని అభినందించారు. మానవత్వానికి వీరు (డ్రైవర్, కండక్టర్) నిదర్శనమని హర్యానా రాష్ట్ర రవాణా మంత్రి మూల్ చంద్ శర్మ పేర్కొన్నారు.