అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ అరెస్ట్

అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ విద్యార్థి, నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయ్యప్పస్వామిపై బైరి నరేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం తో అయ్యప్పస్వాములతో పాటు పలువురు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. నడిరోడ్డుపై బైరి నరేష్‌ అనుచరుడు శంకర్‌పై దాడి చేశారు. నరేష్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భక్తుల ధర్నాలకు దిగారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బైరి నరేష్ పై 153ఏ, 295ఏ, 298, 505 సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రెండు రోజులుగా పరారీలో ఉన్న నరేశ్ ను.. సోషల్ మీడియాలో ట్రేస్ చేసి వరంగల్‌లోని ఓ హోటల్‌లో నరేశ్‌ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నరేశ్‌ను వికారాబాద్ ఎస్పీ కార్యాలయంకు తరలిస్తున్నారు. నరేశ్ అరెస్టుతో.. అయ్యప్ప మాలధారులు తమ ఆందోళనలు విరమించాలని వికారాబాద్ ఎస్పీ కోమటిరెడ్డి కోరారు. నరేశ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.