విరూపాక్ష ఫస్ట్ వీక్ కలెక్షన్స్

సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు రూపొందించిన హర్రర్ మూవీ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించగా , శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. వారం లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.66 కోట్లు షేర్‌, రూ. 57.20 కోట్లు గ్రాస్ వసూలు చేసి తేజ్ కెరియర్ లోనే రికార్డు నెలకొల్పింది.

ఏరియా వైజ్ చూస్తే..

నైజాంలో రూ. 11.11 కోట్లు
సీడెడ్‌లో రూ. 3.65 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 3.24 కోట్లు
ఈస్ట్ గోదావరిలో రూ. 1.76 కోట్లు
వెస్ట్ గోదావరిలో రూ. 1.23 కోట్లు
గుంటూరులో రూ. 1.69 కోట్లు
కృష్ణాలో రూ. 1.63 కోట్లు
నెల్లూరులో రూ. 80 లక్షలతో కలిపి.. రూ. 25.11 కోట్లు షేర్, రూ. 43.40 కోట్లు గ్రాస్ వసూలైంది.
కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.20 కోట్లు
ఓవర్సీస్‌లో రూ. 4.35 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల్లోనే రూ. 31.66 కోట్లు షేర్‌, రూ. 57.20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.