హత్రాస్ ఘటనలో 116కు చేరిన మృతుల సంఖ్య

ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో భోలే బాబా సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 116 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ బాబా సత్సంగ్ కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు 116 మంది భక్తులు మరణించారు. వందకుపైగా గాయపడ్డారు. మరణించినవారిలో పాతిక మందికిపైగా మహిళలు, చిన్నారులు ఉన్నారు.

గత కొన్ని రోజులుగా హాథ్రస్‌ జిల్లా ఫుల్‌రయీ గ్రామంలో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నిన్నే చివరి రోజు. దీంతో బాబాను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రమాదాని ప్రధాన కారణం.. బాబా పాదాల దగ్గర మట్టిని సేకరించేందుకు భక్తుల ఎగబడ్డారు. దీంతో.. ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగింది. ఊపిరాడక చాలా మంది మృతి చెందారు. అయితే.. మొదట మృతుల సంఖ్య ఇంత పెద్ద మొత్తంలో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ.. తొక్కిసలాట జరిగిన దగ్గర మృతదేహాలను వెలికితీస్తే పదుల సంఖ్యల వస్తూనే ఉన్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. కొంతమంది చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఇద్దరు మంత్రులతో పాటు డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులను హత్రాస్ ఘటన స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.