నెక్స్ట్ సీఎం కేటీఆర్ ..హరీష్ రావు రియాక్షన్ మాములుగా లేదు

కేసీఆర్ సీఎం గా ఉన్నప్పటికీ తెరవెనుక అన్ని నిర్ణయాలు తీసుకునేది..అన్ని చూసుకునేది ఆయన వారసుడు కేటీఆరే అని అంత అంటుంటారు. తాజాగా మంత్రి హరీష్ రావు కు కూడా ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. ప్రస్తుతం ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ బిఆర్ఎస్ ప్రచారాన్ని మరింత స్పీడ్ చేసింది. ఓ పక్క వరుస సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే..సోషల్ మీడియా , న్యూస్ చానెల్స్ లలో పాల్గొంటూ బిఆర్ఎస్ గెలుపుకు కృషి చేస్తున్నారు.

తాజాగా మంత్రి హరీష్ రావు..ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో తెలంగాణ సీఎంగా కేటీఆర్ అయితే హరీష్ రావు పాత్ర ఎలా ఉంటుంది అనే ప్రశ్న ఎదురైంది. దీనికి హరీష్ రావు స్పందిస్తూ.. కేటీఆర్ కు నాకు మధ్యలో దూరం పెంచే విధంగా ఇలా అడుగుతుంటారు… కేటీఆర్ నేను మంచి ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ అని చెప్పుకొచ్చారు.

గులాబీ బాస్ కేసీఆర్ ఏ పని అప్పజెప్పితే… ఆ పని నేను చేస్తానని… అలాగే సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను శిరసా వహిస్తానని స్పష్టం చేశారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా… నేను సీఎం కేసీఆర్ వెంట ఉంటానని తెలిపారు. కేసీఆర్‌పై నమ్మకం, మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తాయి.. బీఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. నాకు నేను ట్రబుల్‌ షూటర్‌ అని ఎప్పుడూ చెప్పుకోలేదు.. హరీశ్ రావు ఏనాడు కేసీఆర్‌ మాట జవ దాటలేదని వెల్లడించారు. కేసీఆర్‌ మూడో సారి హ్యాట్రిక్‌ కొడతారు.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను పాటిస్తానన్నారు.