వరవరరావు ఆరోగ్యం పట్ల కుమార్తెలు ఆందోళన

మా నాన్నకు బెయిల్ వచ్చేలా చూడండి..

Varavara Rao
Varavara Rao

హైదరాబాద్‌: విరసం నేత, మానవ హక్కుల కార్యకర్త వరవరరావు బీమా కోరేగావ్ కేసులో ముంబయి జైల్లో ఉన్నారు. అయితే అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయనను జేజే ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వరవరరావు కుమార్తెలు అనల, పవన తండ్రి ఆరోగ్య పరిస్థితి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.మ తండ్రికి బెయిల్ మంజూరు చేసేందుకు చొరవ తీసుకోవాలని వారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తే, ఎన్ఐఏ అందుకు వ్యతిరేకిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, ముంబయిలోని తలోజా జైలు నుంచి తమ తండ్రిని ఆసుపత్రికి తరలించిన విషయమై జైలు వర్గాలు తమకు సమాచారం అందించలేదని వారు ఆరోపించారు. హైదరాబాద్ పోలీసులు తమకు పాసులు ఇస్తామంటున్నారని.. కానీ కోర్టు పర్మిషన్ ఉంటే మాత్రమే తన తండ్రిని కలవగలమన్నారు.  కోర్టు పర్మిషన్ కోసం పిటిషన్ వేశామని.. పర్మిషన్ ఇస్తేనే ముంబైకి వెళ్లి కలుస్తామని పావన తెలిపారు. వరవరరావుతో తమకు వీడియో కాల్ చేయించాలన్నారు. మూడు రోజుల కిందనే వరవరరావు ఆరోగ్యం బాగాలేదని.. తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు చీఫ్ జస్టిస్‌కి లెటర్ రాశామన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/