చాదార్‌ఘాట్‌ వద్ద భారీ అగ్నీ ప్రమాదం..

హైదరాబాద్ చాదార్‌ఘాట్‌ వద్ద మూసి నది ఒడ్డున భారీ అగ్నీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పక్కపక్కనే ఉన్న నలబై గుడిసెలు కాలిపోయాయి. ప్రమాదానికి కారణం ఏంటి అనేది తెలియడం లేదు. ప్రమాదం చోటుచేసుకోవడంతో గుడిసెల్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో స్థానికులు పరుగులు తీశారు. గుడిసెలు కావడంతో అందులో ఉన్న నిత్యవసరాలు ఇతర వస్తువులు కాలి బుడిదయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పారు. కాగా అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణాహని సంబవించలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏకంగా… 40 గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. పుట్‌ పాత్‌… దగ్గర వేసుకుని.. ఉన్న గుడిసెల్లోని ఓ గుడిసెలో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న గుడిసెలకు కూడా మంటలు అంటుకున్నాయి.

చాద‌ర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. 40 గుడిసెలు ద‌గ్ధం.. అగ్ని ప్ర‌మాదం ధాటికి పేలిన సిలిండ‌ర్లు.. కాలి బూడిదైపోయిన గుడిసెల్లోని వ‌స్తువులు, ఇత‌ర సామాగ్రి pic.twitter.com/OOkTc6eDOo— Kamal (@itsmekkprasad) December 31, 2021