తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌ రావు దంపతులు

తెలంగాణ మంత్రి హరీష్ రావు దంపతులు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున తిరుమల చేరుకున్న హరీశ్‌ దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వేంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రి హరీశ్‌ రావుకు వేదపండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంత్రి హరీశ్‌ రావుతోపాటు రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి , రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి శ్రీనివాస రాజులు, జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ హన్సరాజ్‌ గంగారాం కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.