నిరుపేదలకు పాలు, రొట్టెలు అందజేత

కోవిద సహృదయ ఫౌండేషన్‌ చేయూత

Anuhya Reddy

Hyderabad: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రోజువారీ వేతన కార్మికులు, నిరుపేదలు ఆహారం దొరక్క అల్లాడుతున్న విషయం తెలిసిందే.

అలాంటివారిలో కొందరికి తమ కోవిద సహృదయ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పాలు, రొట్టెలు, ఆహారం అందించటం జరిగిందని సంస్థ ఫౌండర్‌ డాక్టర్‌ అనూహ్యరెడ్డి ఒకప్రకటన చేశారు..

నిలోఫర్‌, ఫిల్మ్‌నగర్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ సమీప ప్రాంతాల్లో అభాగ్యులు, నిరుపేదలకు కరోనాపై అవగాహన కల్పించామని తెలిపారు.

ఇలాంటి వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలని వారిలో చైతన్యం కల్గించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/