ప్రధాని మోడీ పై మంత్రి కేటీఆర్ విమర్శలు

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీ పై మండిపడ్డాడు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ పై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోడీ జీ, మిషన్ భగీరథ పథకానికి భారత ప్రభుత్వ సహకారం ఎంత ఉందో దయచేసి తెలంగాణ ప్రజలతో పంచుకోండి..మిషన్ భగీరథ స్కీమ్ కు మీ ప్రభుత్వం సున్నా సహకారం అందించడం ప్రధానమంత్రి స్థాయికి తగినది కాదు” అంటూ మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని బిజేపి వాళ్లు మొదటి నుండి చెపుతూనే ఉన్నారు మనకే అర్దం కావడం లేదని మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరలు డబుల్ చేయడం, కార్పొరేట్ సంస్థల సపదన డబుల్ చేయడం, నిత్యవసర వస్తువుల ధరలు డబుల్ చేయడం, గ్యాస్ ధరలు డబుల్ చేయడమేనా డబుల్ ఇంజిన్ సర్కార్ లక్ష్యం అంటూ ఫైర్ అయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/