తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

ఐదు నిమిషాలు ఆలస్యమైనా..విద్యార్థులకు అనుమతిస్తామన అధికారులు

ssc  exams
ssc exams

హైదరాబాద్‌: తెలంగాణలో పదో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 2530 కేంద్రాలను విద్యాశాఖ సిద్ధం చేసింది. మొత్తం 5.34 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. . ప్రతి పరీక్షా కేంద్రంలోనూ శానిటైజర్లను అందుబాటులో ఉంచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి రూమ్‌లో 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జలుబు, దగ్గు, జర్వం ఉన్నవారి కోసం ప్రత్యేక గదులు కేటాయించాలని నిర్ణయించారు. కాగా విద్యార్థులు మాస్కులు ధరించినా అనుమతిస్తామని, విద్యార్థులు తీసుకొచ్చే వాటర్ బాటిళ్లకు కూడా అనుమతి ఉంటుందని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చేతులను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ శానిటైజర్లు లేదా లిక్విడ్ సోప్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/