జీతాల ఆలస్యానికి కారణం కేంద్రమే – మంత్రి హరీష్ రావు

తెలంగాణలో టీచర్ల జీతాల చెల్లింపు ఆలస్యం కావడానికి కేంద్రమే కారణమని మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను ఆపడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల విషయంలో సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారని అన్నారు. ఉద్యోగుల సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని , విద్యాశాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు.

హైద‌రాబాద్ వ‌న‌స్థ‌లిపురంలో నిర్వ‌హించిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) స‌మావేశంలో మంత్రి హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు. రాష్ట్రంలో మొట్ట‌మొద‌టి ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ. ఉపాధ్యాయుల హ‌క్కుల కోస‌మే కాకుండా స‌మాజం కోసం, విద్యార్థుల కోసం పోరాటం చేసిన సంస్థ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం. ఈ సంఘం ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్లాలి. ఉన్న‌త విద్యాబోధ‌న కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.