కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శప్రాయంః సిఎం కెసిఆర్‌

cm-kcr-tribute-to-konda-laxman-bapuji-jayanthi

హైదరాబాద్‌ః ఈరోజు కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి . ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ ఆయనకు నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని సీఎం కెసిఆర్‌ కొనియాడారు. ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, ఉద్యమకారుడిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా ఆయన జీవితం రేపటి తరానికి ఆదర్శప్రాయమని ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొంటూనే చాకలి ఐలమ్మ సహా ఉద్యమకారులకు అడ్వకేట్‌గా సేవలందించారని గుర్తు చేశారు. చేనేత రంగంలో ప్రతిభ కనబరిచినవారికి ఆయన పేరుతో అవార్డులు అందజేస్తున్నామన్నారు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం భావి తరాలకు ఆదర్శనీయమని మంత్రి హరీశ్ రావు అన్నారు.ఆయన జయంతి సందర్భంగా ట్వీట్ చేసిన హరీశ్ రావు.. తొలి తరం ఉద్యమ నాయకులు తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలిచిన బాపూజీ.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా, తన జీవిత కాలం అంతా ప్రజల కోసమే పరితపించారని కొనియాడారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/