జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నివాళులర్పించిన ప్రధాని మోడీ

టోక్యోః భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు పుష్ప నివాళి అర్పించారు. షింజో అబేకు ఇవాళ టోక్యోలో తుది వీడ్కోలు పలుకుతున్నారు. నిప్పాన్ హాల్లో నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. అబేకు తుది వీడ్కోలు పలికేందుకు సోమవారం ప్రధాని మోడీ జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. జూలైలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న షింజో అబేను ఓ వ్యక్తి తన వద్ద ఉన్న గన్తో కాల్చి చంపారు. అయితే ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్న నివాళి కార్యక్రమం పట్ల ఆ దేశంలో వ్యతిరేకిత వస్తోంది. ప్రభుత్వ అంత్యక్రియలను వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు.
నిప్పాన్ బుడోకాన్ వేదిక వద్దకు షింజో అబే భార్య అక్కీ అబే అస్థికలను తీసుకువచ్చారు. నిప్పాన్ హాల్ వద్ద అబే జీవితంపై రూపొందించిన వీడియోను ప్లే చేశారు. ఆ తర్వాత ప్రధాని ఫుమియో కిషిదా స్మారక సందేశాన్ని ఇచ్చారు. అబే ధైర్యాన్ని, అంకితభావాన్ని ఆయన కొనియాడారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను ఇండియా మిస్సవుతున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్, దక్షిణ కొరియా ప్రధాని హన్ డక్ సూ కూడా నివాళి అర్పించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/