టిడిపి, జనసేన పార్టీల పొత్తులపై హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు

జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..?.. హరిరామ జోగయ్య లేఖ

harirama-jogaiah

అమరావతిః టిడిపి – జనసేన పార్టీల పొత్తులపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య తాజాగా లేఖ విడుదల చేశారు. జన సేనకు 25-30 సీట్ల పొత్తు విఫల ప్రయోగమే అని ఫైర్‌ అయ్యారు. జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..? అంటూ విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో సర్దుకు పోవటమే కారణమా..? అంటూ లేఖలో ప్రశ్నించారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. 2019లో పోటీ చేసి ఓడిపోయిన అనేకమంది జనసేన నాయకులు 2024 లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పొత్తులో భాగంగా తక్కువ సీట్ల కేటాయిస్తారన్న సంకేతాలు ఆశావాహులను నిరాశ నిస్పృహలకు లోన ఎలా చేస్తున్నాయని తెలిపారు. పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తూ టిడిపికి ఎక్కువ సీట్లు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని హరిరామ జోగయ్య ఆగ్రహించారు. .