నేడు రూ.4,833 కోట్లతో ఏర్పాటయ్యే పరిశ్రమలకు జగన్ శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ లో రూ.4,833 కోట్లతో ఏర్పాటయ్యే పలు పరిశ్రమలకు సీఎం జగన్ నేడు వర్చువల్ గా శంకుస్థాపన చేయబోతున్నారు. రిలయన్స్ బయో ఎనర్జీ రూ.1,024 కోట్లతో 8 ప్రాంతాల్లో బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.

ఆదిత్య బిర్లా గ్రూపు రూ.1,700 కోట్లతో నాయుడుపేటలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్బన్ బ్లాక్ను నెలకొల్పనుంది. వీటితో పాటు హెల్లా ఇన్ఫ్రా, వెసువియస్ ఇండియా లిమిటెడ్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.

ఇదిలా ఉంటె గ్రామ/వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం రేపట్నుంచి సేవా రత్న, వజ్ర, మిత్ర అవార్డులను ఇవ్వనుంది. వీటితో పాటు నవరత్నాల లబ్ధిదారుల జీవన ప్రమాణాలపై ఉత్తమ వీడియోలు రూపొందించిన వారికి ప్రత్యేక నగదు ఇవ్వనుంది. మండల, మున్సిపల్, కార్పొరేషన్ స్థాయిలో 796 మందిని ఎంపిక చేసి రూ. 15వేలు, నియోజకవర్గ స్థాయిలో 175 మందికి , రూ. 20వేలు, జిల్లా స్థాయిలో ఎంపికైన 26 మందికి రూ. 25వేల చొప్పున నగదు ఇవ్వనుంది.