మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది త్రివిక్రమ్ టీం. ప్రస్తుతం మహేష్..త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మహేష్ తల్లి చనిపోవడం , రీసెంట్ గా తండ్రి కృష్ణ కూడా మరణించేసరికి సినిమా షూటింగ్ ఆగిపోయింది.
ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను ఖరారు చేసారు. ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాతే మొదలు కానున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా సంక్రాంతి తర్వాత మార్చి వరకు లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తు్న్నారట. దాదాపు 60రోజులు బ్రేక్స్ లేకుండా నిర్విరామంగా షూటింగ్ జరపనున్నారట. ఈ సినిమాను హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.చినబాబు నిర్మిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.