ప్రభాస్ తో సీతారామం డైరెక్టర్..?

సీతారామం తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న హను రాఘవపూడి..ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందాల రాక్షసి మూవీ తో డైరెక్టర్ గా పరిచమైన హను రాఘవపూడి మొదటి చిత్రంతోనే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని అందించి తన సత్తా చాటుకున్నాడు. రీసెంట్ గా సీత రామం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వార్తల్లో నిలిచారు.

ప్రస్తుతం ఈయన వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఒక పీరియాడికల్ యాక్షన్ లవ్ స్టొరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ కథ కోసం సూర్య , రామ్ చరణ్ , కార్తీ లలో ఒకరితో చేయాలనీ అనుకున్నాడు. కానీ వారు ప్రస్తుతం బిజీ గా ఉండడం తో అదే కథను ప్రభాస్ కు వినిపించగా..వెంటనే ఓకే చెప్పాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రభాస్ కి ఓ మూవీ కోసం అగ్రిమెంట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో హను రాఘవపూడి ప్రభాస్ కాంబో సినిమాని వారే నిర్మించడానికి రెడీ అవుతున్నారని టాక్.