పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూ

సిద్ధూను పీసీసీ చీఫ్‌గా, మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు

న్యూఢిల్లీ : పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నవజోత్‌ సింగ్‌ సిద్దూను పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం నియమించారు. రాష్ట్ర సీఎం అమరీందర్‌ తీవ్ర అభ్యంతరం తెలిపినప్పటికీ సోనియా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రస్తుత అధ్యక్షుడు సునీల్‌ జఖర్‌ స్థానంలో సిద్దూ బాధ్యతలను స్వీకరించారు. సిద్దూకు సహాయంగా సంగత్‌సింగ్‌, సుఖ్వీందర్‌ సింగ్‌, పవన్‌ గోయల్‌, కుల్జీత్‌ సింగ్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా సోనియా నియమించారు.

పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కొంత కాలంగా సిద్దూ, అమరీందర్‌ మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సిద్దూ సొంత పార్టీ నాయకుడు అమరీందర్‌పైనే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. తిరుగుబాటు జెండా ఎగురవేసి తనకు మద్దతుగా కొంతమంది ఎమ్మెల్యేలను కూడగట్టుకొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో విభేదాలకు చెక్‌ పెట్టేందుకు సోనియా రంగంలోకి దిగారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/