ఇమ్రాన్ ఖాన్ పై నవాజ్ షరీఫ్ కూతురు కీలక వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఆట ముగిసినట్టేనన్న మరియం

Maryam Nawaz Strongly Criticize On Imran Khan

ఇస్లామాబాద్‌ః పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ పై మాజీ పీఎం నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ను ఉద్దేశించి ఆట ముగిసింది అని అన్నారు. పాక్ లోని వెహారీ పట్టణంలో పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ… ఈ నెల 9న ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, ఆ తర్వాత ఆయన పార్టీ శ్రేణులు హింసాత్మక నిరసనలకు దిగడం వంటి వాటిని ప్రస్తావించారు. ఇమ్రాన్ పార్టీ నుంచి వరుసగా కీలక నేతలు బయటకు వచ్చేస్తున్నారని… ఇమ్రాన్ ఆట ముగిసినట్టేనని చెప్పారు. 9వ తేదీన చోటు చేసుకున్న హింసకు ఇమ్రానే కారణమని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారు చెపుతున్నారని అన్నారు.