ఇంట్లోనే హ్యాండ్ వాష్
చేతుల్ని శుభ్రం చేసుకునేందుకు సబ్బు, హ్యాండ్‌వాష్‌లను ఉపయోగించటం కన్నా సహజంగా దొరికే పదార్థాలతోనే హ్యాండ్‌వాష్ తయారుచేసుకోవచ్చు.

అదెలాగంటే కొన్ని గులాబీరేకులు, రెండు చెంచాల కలబంద గుజ్జు, గులాబీ నీరు, కొన్ని కుంకుడు కాయలతో చేసుకోవచ్చు.
కుంకుడు కాయలను ముందు రోజు రాత్రి నీళ్లలో నానబెట్టుకోవాలి. మర్నాడు వాటిలోని గింజలు తీసి పై పొట్టును కొడితే గుజ్జులా వస్తుంది. దాన్ని మిక్సీలో వేయాలి. అందులోనే మిగతా పదార్తాలను వేయాలి. ఈ మిశ్రమాన్ని మెత్తగా చేసుకోవాలి.
ఇది లేత గులాబీ రంగులో కనిపిస్తుంది. చిక్కగా ఉందనిపిస్తే కొంచెం నీళ్లు కలపాలి. దీన్ని చేతులు కడుక్కునేందుకు వాడకోవచ్చు.
కుంకుడు కాయల రసం సబ్బు ద్రావణంలా జారుడుగా ఉండి నురవ వస్తుంది. చేతులపై పేరుకున్న క్రిములను తొలగిస్తుంది.
గుబీ రేకలు చక్కటి పరిమళాన్ని, మెరుపు, మృదుత్వాన్ని ఇస్తాయి. ఈ పూలలోని యాంటిఆక్సిడెంట్ సమ్మేళనాలు గోళ్లని మురికిని తొలగిస్తాయి. కలబంద గుజ్జు చేతులను మృదువుగా మార్చడమే గాక హానికర సూక్ష్మజీవులను చంపేస్తుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/