పెరిగిన మైక్రోవేవ్‌ వినియోగం

కిచెన్‌లో వస్తువులు-వాడకం

microwave consumption
microwave consumption

సాధారణంగా మనదేశంలో వంటకు స్టవ్‌ టాప్‌ లేదా సాంప్రదాయ పొయ్యిలను ఉపయోగించడానికే ఇష్టపడతారు. ఇతర పద్ధతుల దావరా వంటకాలు సరైన రుచులను పొందలేవని మన వారి నమ్మకం.

మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడిచేయడంపై సందేశాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో మైక్రోవేవ్‌ ఉపకరణాలు విరివిగా వాడుతున్నారు.

వంట, వేడిచేయడం, బేకింగ్‌ వంటి వాటికి ఉపయోగించే మైక్రోవేవ్‌ ప్రస్తుతం ప్రతి ఇంట్లో ముఖ్యమైన ఉపకరణంగా మారింది. నేటి ఫాస్ట్‌ లైఫ్‌ స్టైల్లో చాలా ఇళ్లలో భార్యాభర్తలిద్దరు పనిచేస్తున్నారు.

అటువంటి వారు వంట చేసుకోవడానికి తక్కువ సమయం ఉండటం మూలాన మైక్రోవేవ్‌ వినియోగం చాలా పెరిగింది. మైక్రోవేవ్‌ను ఎలక్ట్రిక్‌ ఓవెన్‌ అని కూడా పిలుస్తారు.

ఇది మైక్రోవేవ్‌ ఫ్రీక్వెన్సీ పరిధిలోని ఎలక్ట్రోమాగ్నటిక్‌ రేడియేషన్స్‌ ద్వారా ఆహారాన్ని వేడి చేస్తుంది లేదా ఉడికిస్తుంది.

సాధారణంగా మనదేశంలో వంటకు స్టవ్టాప్‌ లేదా సాంప్రదాయ పొయ్యిలను ఉపయోగించడానికే ఇష్టపడతారు. ఇతర వంట పద్ధతుల ద్వారా వంటకాలు సరైన రుచులను పొందకపోవడం ఇందుకు కారణం.

మైక్రోవేవ్‌ ఓవెన్ల ద్వారా చల్లారిన ఆహారాన్ని మళ్లీ వేడిచేయడం, వేడినీరు, ఇడ్లీ, కూరగాయలు వంటి వాటిని ఆవిరి చేయడానికి సులభమైన పద్ధతి.

మైక్రోవేవ్‌ల్లో వంట మూలాన రుచి తగ్గడమే కాకుండా ఆహారంలోని పోషకాలు నాశనమవుతాయి.

అంతేకాక మైక్రోవేవ్‌ ఓవెన్‌ వాడటం వల్ల ప్లాస్టిక్‌ కంటైనర్ల నుంచి వచ్చే రసాయనాలు ఆహారంలోకి ప్రవేశిస్తాయి. దీని వలన మన శరీరానికి విపరీతమైన దీర్ఘకాలిక హాని కలిగే అవకాశం ఉంది.

microwave consumption

స్థానికంగా పెరిగిన ఆకుకూరలు, ఇతర పదార్థాలను వాడటం మూలాన మన ఆహారంలో మంచి పోషకాలు లభ్యమవుతాయి. కూరగా యలను కత్తిరించి తర్వాత వాటిని కడగడం వల్ల నీటిలో కరిగే విటమిన్లను కోల్పోతారు.

ఎక్కువ కాలం లేదా అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేయడం కూడా ఆహారంలో పోషకాలు నాశనం అవడానికి కారణమవుతాయి.

అదేవిధంగా మాంసం వేయించడం ప్రమాదకరమైన నైట్రోసమైన్ల ఉత్పత్తికి దారి తీస్తుంది.

కాబట్టి మైక్రోవేవ్లో మాంసం వేడి చేయడం మంచిది కాదు. మైక్రోవేవ్‌ వంటలోని పోషకాలను కూడా ప్రభావితం చేస్తుంది.

మైక్రోవేవ్‌లో తీవ్రస్థాయిలో వేడి ఉంటుంది. దీనిలో ఆహారానిన వేడి చేయడం వల్ల విటమిన్‌ బి 12 దెబ్బతింటుంది.

ఆకుకూరలను నీటిలో ఉడకబెట్టినప్పుడు ఫోలెట్‌ విటమిన్‌ పోతుంది. కాని మైక్రోవేవ్‌లో వంట చేయడం వల్ల ఈ నష్టాన్ని 77 శాతం వరకు నివారించవచ్చు.

సాధారణంగా మనం ఆకుకూరలను కట్‌ చేయడానికి ముందే కడుగుతాము. అందువల్ల అందువల్ల ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మైక్రోవేవ్‌లో వండిని మాంసం చాలా తక్కువ నైట్రోసమైన్‌ స్థాయిని కలిగి ఉంటుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/