వర్షంలో కురులు జాగ్రత్త!

అందమే ఆనందం

ప్రస్తుతం రోజుకో రకంగా వాతావరణం మారుతోంది.. ఒకసారి ఎండగా ఉంటే, మరో నిముషంలో వర్షం.. ఇది మనల్నే కాదు కురులనూ ఇబ్బంది పెడుతుంది.. ఫలితమే వెంట్రుకలు పొడిబారి పోవటం , గడ్డిలా తయారవటం , మాడుపై దురద, చుండ్రు వంటివన్నీ … వీటికి దూరంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..

కొబ్బరి నూనెలో అలోవెరా లేదా గ్రీన్ టీ ఆకులు వేసి వేడిచేసి , తలకు పట్టించండి.. దీన్ని వారానికి రెండు సార్లు రాస్తే వెంట్రుకలు , కుదుళ్ళ నుంచి బలంగా తయారవుతాయి.. పొడిబారటం, చివర్లు చిట్లటం వంటి సమస్యలు ఉండవు.

వర్షానికి తడిసారా? .. కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్, వాన నీటి ద్వారా వచ్చి చేరతాయి. ఇవి మాడుపై చేరి కుదుళ్లకు తేమ అందకుండా అడ్డుకుంటాయి.. దీంతో జుట్టు గడ్డిలా తయారవ్వటమే కాదు. ఊడిపోవటానికి కారణం అవుతాయి.. కాబట్టి. తడిసిన తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం తప్పక చేయాలి.. కండీషనర్ ఉపయోగించటమూ తప్పనిసరే .

ఈ కాలం డ్రయ్యర్ లను వాడక పోవటమే మంచిది. అవి కురుల్లో తేమను దూరం చేస్తాయి.. టవల్ ను చుట్టి ఉంచి.. నీరు కారటం ఆగాక, గాలికి ఆరబెట్టటం మంచిది.. సరైన దువ్వెనను ఎంచుకోవటమూ ప్రధానమే.. చెక్క లేక పెద్ద పళ్లున్న వాటినే ఉపయోగించాలి..

మరిన్ని ఆరోగ్య సంబంధిత విషయాల కోసం (నాడి) క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/health1/