పైనాపిల్‌ రైస్‌

రుచి: వెరైటీ వంటకాలు

Pineapple Rice
Pineapple Rice

పైనాపిల్‌ రైస్‌.. థాయ్ లాండ్‌లో ఇది చాలా ఫేమస్‌.వంటింట్లో ఉండే పదార్థాలతోనే ఈ వెరైటీ రెసిపీని తయారుచేయవచ్చు.

పైనాపిల్‌ తియ్యగా, పుల్లగా భలే ఉంటుంది. ఈ పండుతో జ్యూస్‌లు, స్వీట్లు తయారు చేసుకోవచ్చు అలాగే థా§్‌ు పైనాపిల్‌ రైస్‌ కూడా చేసుకోవచ్చు.

చూడ్డానికి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. రుచి చాలా బాగుంటుంది.

కావలసిన పదార్థాలు

బియ్యం – 250 గ్రాములు, పైనాపిల్‌ ముక్కలు – ఒక కప్పు, ఉల్లిపాయలు – రెండు (ముక్కలుగా చేసుకోవాలి), అల్లం ముక్కలు కొన్ని, తాజా పసుపు ముక్కలు – అయిదు.

కరివేపాకు రెబ్బలు – కొన్ని, లెమన్‌ గ్రాస్‌ ముక్కలు – రెండు, కొబ్బరి పాలు, కొబ్బరిపాలు – ఒక కప్పు. ఉప్పు – తగినంత, నూనె – తగినంత.

నీరు – రెండు కప్పులు. చిటికెడు పసుపు, కర్రి పౌడర్‌, ఒక పైనాపిల్‌ పండు.

తయారు చేయు విధానం

బియ్యాన్ని అరగంటపాటు నాననివ్వాలి. స్టవ్‌పై ప్యాన్‌ పెట్టి నూనె వేసి ఉల్లిపాయముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

అందులోనే అల్లం, కరివేపాకు, పసుపు, లెమన్‌ గ్రాస్‌ వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఈ మిశ్రమంలో నానబెట్టిన బియ్యం వేసి కర్రీపౌడర్‌, పసుపు వేయాలి.

ఉప్పు వేసి కలపాలి. కాసేపాగి కొబ్బరిపాలు, పైనాపిల్‌ ముక్కలు వేసి నీళ్లు పోసి మూతపెట్టాలి. సన్నని మంటపై దమ్‌ చేయాలి. ఒక పైనాపిల్‌ పండును తీసుకుని నిలువగా సగానికి కోసి మధ్యలో ఉన్న పండును మొత్తం తీసివేయాలి.

ఆ పండులో పైనాపిల్‌ రైస్‌ వేసి సిల్వల్‌ ఫాయిల్‌ చుట్టి, మరికాసేపు కుక్‌ చేయాలి. ఆ తరువాత సిల్వర్‌ ఫాయిల్‌ తొలగించి వేడివేడిగా వడ్డించాలి.

ఈ రైస్‌ రుచి ఎంతబాగుంటుందో తిని చూడాల్సిందే. మరి మీరూ ట్రై చేయండి

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/