జీవితంలో సమస్యలు సాధారణమే

‘మనస్విని’

sorrow
sorrow

మేడమ్‌! నా వయసు 62 సంవత్సరాలు. ఈ మధ్యనే రిటైర్‌ అయ్యాను. ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది. నేను ఈ శేష జీవితం ఎలా గడపాలి అని. రోజూ టివిలో ఈ కరోనా వార్తలు చాలా నిస్పృహ కలిగిస్తున్నాయి. 60 సంవత్సరా వారికి ఈ కరోనా రావచ్చు అని ఎక్కువగా చెపుతున్నారు. అంతేగాక పెన్షన్‌ డబ్బులు కూడా మొత్తంగా రావ్ఞ అని చెపుతున్నారు. ఈ విషయాలన్నీ వింటుంటే చాలా భయంగా ఉంది. ఏం చేయమంటారు? – కల్పన

మీరు తప్పక ఈ భయందోళన నుండి బయట పడండి. భయపడవద్దు. ఆశతో జీవించాలి. అన్నీ సరిదిద్దుకుంటాయి. మీ జాగ్రత్తలో మీరు ఉండండి.

మనిషికి అవసరాలకు ఖర్చు పెట్టేది కూడా చాలా తక్కువ. ఎక్కువ డబ్బ అవసరం లేదు.

కోర్కెలకు డబ్బు ఎక్కువ ఖర్చు అవ్ఞతుంది. అందువల్ల డబ్బు గురించి అందువల్ల డబ్బు గురించి ఆందోళన చెందవద్దు. దేని గురించి ఆందోళన చెందవద్దు. మన జీవితం యొక్క విలువ మందు మన సమస్యలు చాలా తక్కువే. జీవితం అమూల్యమైనది. హాయిగా జీవించండి. ఆనందంతో ఉండండి.

మీకు జబ్బు ఏమీ రాదు. మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. హాయిగా, విశ్రాంతిగా ఇంట్లో గడపండి. పిల్లలతో హాయిగా గడపండి. మంచి మంచి పుస్తకాలు చదవండి. మంచి ప్రోగ్రాములు చూడండి. అన్నీ సానుకూలంగా ఉన్నాయని భావించాలి.

నిజానికి అన్నీ సానుకూలంగానే ఉన్నాయి. ఈ భూమి ఎంతో అందమైంది. గాలి, నీరు అన్నీ ఉన్నాయి. మన ఆహారానికి ఢోకా లేదు.

నిత్యావసరాలు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అన్నీ బాగున్నప్పుడు దిగులు ఎందుకు? అన్ని సవ్యవంగానే ఉన్నాయి.

ఈ పరిస్థితి ‘లాక్‌డౌన్‌ ఎల్లప్పుడూ ఉండదు. పోతుంది. ధైర్యంగా, ఆనందంగా ఉండండి. అన్నీ సర్దుకుంటాయి. జీవితం విలువ గ్రహించండి. జీవన నైపుణ్యాలు నేర్చుకోండి.

అనుమానం పెనుభూతం. అనుమానాలు దగ్గరకు రానీయవద్దు. ఆత్మవిశ్వాసంతో జీవించండి. ఆత్మవిశ్వాసం ఉంటే హాయిగా జీవించవచ్చు. ధైర్యంగా ఉంటే ఏ పనైనా సులువ్ఞగా జరిగిపోతుంది. అవగాహనతో జీవించాలి.

అన్నిటికీ మించింది మానసిక ఆనందం

మేడమ్‌! నా వయసు 78 సంవత్సరాలు. నాకు చాలా దిగులుగా ఉంది. ఒళ్లు నెప్పులు ఎక్కువగా ఉంటున్నాయి. మోకాళ్ల నెప్పులు, నడుంనొప్పి, తలనొప్పి తరచూ వస్తున్నాయి. ఎల్లప్పుడూ ఏదో ఒక పని ఉంటుంది ఇంట్లో. ఇప్పుడు సరిగా పని చేయలేకపోతున్నాను. అందువల్ల దిగులుగా ఉంది. ఇంట్లో సాయం సరిగా చేయలేకపోతున్నాను. వయసు మీరిపోతోంది. నేను బాగా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – భవాని


మీరు తప్పక సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలరు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి. నొప్పి ఉన్నప్పుడు పనిచేయకూడదు. తగు విశ్రాంతి తీసుకోవాలి.

మంచి ఆహారం, మంచి నిద్ర ఉండాలి. వంగి, వంగి పనులు చేయవద్దు. మంచి పొజిషన్‌లో మాత్రమే పని చేయాలి.

అప్పుడు ఏ నెప్పులు ఉండవ్ఞ. నొప్పి వచ్చిందంటే దాని అర్థం ఆ పరిస్థితిని శరీరం అంగీకరించట్లేదని అర్ధం. ఏ ఆకృతిలో నొప్పి లేదో, ఆ ఆకృతిలో వంగి పనిచేసుకోవచ్చు. శరీరంలో మంచి డాక్టరు ఉంటారు. సరియైన జాగ్త్రతలు తీసుకోనప్పుడు నొప్పి వస్తుంది.

అందువల్ల మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు మీకు ఏ నొప్పులూ రావ్ఞ. అన్నింటికీ మించిందే మానసిక ఆనందం, తృప్తి. ఎప్పుడైతే ఆనందంతో తృప్తితో ఉంటారో, అప్పుడు శారీరక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

అందువల్ల మంచి దిన చర్యతో ఆనందకరమైన దినచర్యతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. దీనిలో అనుమానం లేదు. పరిశోధనలు కూడా ఇలానే చెపుతున్నాయి.

ఆరోగ్యానికి వయసుతో నిమిత్తం లేదు. ఏ వయసు లోనైనా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలరు.

తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పక దైనందిన జీవితం పరమానదంతో కూడినదిగా ఉండాలి. మానసిక, శారీరక ఆరోగ్యాలు ఆనందదాయకంగా సరిదిద్దుకోవాలి.

ఎల్లప్పుడూ సంతోషంగా, ఉండాలి. ఉల్లాసంగా ఉండాలి. తృప్తిగా ఉండాలి.

  • డాక్టర్‌ ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/