ఎంజీఎం ఆస్పత్రిలో కేసీఆర్ సందర్శన
నేరుగా కరోనా రోగులకు పరామర్శ

Warangal: తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు. ఆ సమయంలో ఆయన ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండానే రోగులతో మాట్లాడారు. కేవలం మాస్కు, ఫేస్ షీల్డ్ పెట్టుకుని కరోనా రోగులను పరామర్శించారు.నేరుగా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా రోగులని పలకరించి వారిలో మనో ధైర్యం కలిగించారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సిబ్బందిని సీఎం ఆరా తీశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి కెప్టెన్ ఇంటికి చేరుకొని భోజనం చేయనున్నారు. ఆ తర్వాత 2 గంటలకు ఎంజీఎం కు వెళ్తారు. రోగులతో మాట్లాడడంతో పాటు దవాఖానలోని మౌలిక వసతులను పరిశీలిస్తారు. అనంతరం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/