టిఆర్ఎస్ విజయ గర్జన సభ కు అనుమతి ఇచ్చిన రైతులు

నవంబర్ 29 న వరంగల్ నగరంలోని దేవన్నపేట వద్ద టిఆర్ఎస్ విజయ గర్జన సభ ఏర్పటు చేయబోతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏళ్ల పండుగ సందర్భంగా వరంగల్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయ గర్జన సభను నిర్వహించాలని టిఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అయితే కొద్దీ రోజుల క్రితం రైతులు షాక్ ఇచ్చారు. పంటల సాగుచేస్తున్న భూములను సభ కోసం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే లను , మంత్రులను అడ్డుకున్నారు.

కానీ ఇప్పుడు ఆ రైతులే సభ కు తమ భూములు ఇస్తామని ముందుకు వచ్చారు. ఈ సభ నిర్వహణ కోసం ఏకంగా 130 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో తెరాస నేతలు హమ్మయ్య అనుకున్నారు. తమ భూములను తాత్కాలికంగా వినియోగించుకునేందుకు వీలుగా సదరు రైతులు స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు అంగీకార పత్రాలు అందజేశారు. దీంతో సభ నిర్వహణకు అనుగుణంగా ట్రాక్టర్లు, జెసిబి లతో భూమి చదును చేసే పనులు మొదలు పెట్టారు. బహిరంగ సభ, వేదిక, పార్కింగ్ ఇతర వస్తువుల కు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు టిఆర్ఎస్ నాయకులు.