కొత్త షెడ్యూల్ మొదలుపెట్టుకోబోతున్న ‘గుంటూరు కారం’

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న గుంటూరు కారం కొత్త షెడ్యూల్ కు సిద్ధమైంది. అతడు , ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన టీజర్ ఫ్యాన్స్ లలో పూనకాలు పుట్టించింది.

ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసిన మేకర్స్..ఈ నెల 12 నుండి కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నారు. దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుందని అంటున్నారు. ఇంపార్టెంట్ యాక్షన్ సీన్స్‌‌‌‌ను ఈ షెడ్యూల్‌‌‌‌లో తీయబోతున్నారట. అలాగే హీరోయిన్‌‌‌‌ శ్రీలీల కూడా షూట్‌‌‌‌లో జాయిన్ అవనున్నట్టు సమాచారం. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 13న సినిమా విడుదల కానుంది.