గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల..మ‌ధ్యాహ్నం 11 గంట‌ల‌కు 19.06 శాతం పోలింగ్

gujarat-assembly-election-update

అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల తుది, రెండో ద‌శ పోలింగ్ కొన‌సాగుతోంది. మ‌ధ్యాహ్నం 11 గంట‌ల‌కు 19.06 శాతం పోలింగ్ న‌మోదైంద‌ని అధికారులు వెల్ల‌డించారు. తుది ద‌శలో 14 జిల్లాల్లో విస్త‌రించిన 93 స్ధానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా 2.5 కోట్ల మందికి పైగా ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు.

తుది ద‌శ పోలింగ్‌లో మొత్తం 833 మంది అభ్య‌ర్ధుల భ‌విత‌వ్యాన్ని ఓట‌ర్లు నిర్ధారించ‌నున్నారు. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బిజెపి, ఆప్‌, కాంగ్రెస్‌ల మ‌ధ్య త్రిముఖ పోరు నెల‌కొంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండో ద‌శ పోలింగ్‌లో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/