ఓటేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

home-minister-amit-shah-cast-his-vote

న్యూఢిల్లీః కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ నారన్ పురాలోని ఏఎంసీ సబ్ జోనల్ ఆఫీస్ లో ఓటు వేశారు. అమిత్ షా కొడుకు బీసీసీఐ సెక్రటరీ జై షాతో పాటు ఇతర కుటుంబసభ్యులు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని అభ్యర్థించారు. ముఖ్యంగా తొలిసారి ఓటు వేస్తున్న యువతీ యువకులు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

కాగా, ఓటు వేసిన అనంతరం హోం మంత్రి అమిత్ షా అహ్మదాబాద్ లోని ఓ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/