చేనేత కార్మికులకు చేయూత ఏదీ?

ప్రభుత్వాలు ఆదుకోవాలి

Handloom Workers
Handloom Workers

భారతీయ జీవన స్రవంతిలో చేనేత రంగం ప్రాధాన్యత విస్మరించజాలనిది.

యాంత్రీకరణకు ముందు వ్యవ సాయరంగం తర్వాత అత్యధిక ప్రజా జీవనానికి ఉపాధి అవకా శాలు కల్పించిన చేనేత వస్త్రరంగం పర్యాయపదంగా మారింది.

ప్రభుత్వ విధానాలు చేనేతల పాలిట మరణశాసనాలుగా మారు తున్నాయి. భారతదేశంలో ఉన్న చేనేత మగ్గాలలో పదిశాతం అంటే రెండు లక్షలకుపైగా చేనేత మగ్గాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి.

ఒక మగ్గం పనిచేస్తే ఆ చేనేత కార్మికుడి కుటుం బంలోని నలుగురు సభ్యులకేకాక, వస్త్ర తయారీకి ముందు, తర్వాత పనుల ద్వారా ఆరుగురికి ప్రత్యక్ష ఉపాధి కలుగుతుంది.

అలా దాదాపు ఇరవై లక్షలకుపైగా కార్మికులు చేనేతపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్నారు.

ప్రభుత్వ చేనేత వ్యతిరేక విధానాల ఫలితంగా చేనేత వృత్తి దెబ్బతింటున్నది. పేదరికం పెరుగుతున్నది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు.

ఇంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత పరిశ్రమను ప్రోత్సహించి సమగ్రాభివృద్ధి పరచాల్సిన రీతిలో అధికార పార్టీకి, వివిధ రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేదు.

ఫలితంగా చేనేత కార్మికులు బతుకుతెరువు కోసం వలసలు పోవడం, తగిన కూలిగిట్టక నేతన్నలు అప్పులపాలై ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటి అయింది. చేనేత రంగం రాష్ట్రంలో ప్రస్తుతం కొన ఊపిరితో ఉంది.

ఆ రంగానికి చేయూతకు కనీస చిత్తశుద్ధిని ప్రభుత్వం కనబర్చకపోగా మూలిగే నక్కమీద తాటికాయపడ్డచందాన మాటలకందని మహా విషాదాన్ని కొవిడ్‌-19 మహమ్మారి దేశం లాక్‌డౌన్‌ నేపథ్యంలో చేనేత రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది.

రాష్ట్రంలో చేనేత కార్మి కులు జీవనోపాధి లేక ఎలాంటి ఆదాయ వనరులు లేక సర్వస్వం కోల్పోయి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు.ఆత్మగౌరవం ఒకవైపు, ఆకలి తిప్పలు మరో వైపు చేనేత కార్మికులను పీడిస్తున్నాయి.

ఇంటి నుండి బయటకు రాలేక,మగ్గం పనులు సాగక, చేతిలో డబ్బులేక నిత్యావసరాలు కొనలేక కుటుంబాన్ని పోషించలేక కష్టనష్టాలు కన్నీళ్లే దిక్కవ్ఞతూ దయనీయంగా అవస్థపడుతున్నారు. చేనేత కార్మికులు తీవ్ర మన స్తాపానికి గురై ఆకలిచావ్ఞలకు, ఆత్మహత్యలకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేనేతకు ప్రత్యేకత ఉన్నది. అగ్గిపెట్టలో పట్టే ఆరుగజాల చీరను ప్రపంచానికి అందించిన ఘనత తెలంగాణాకే దక్కుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 40వేల మగ్గాలున్నాయి.(రాష్ట్రప్రభుత్వ లెక్కలప్రకారం జియోట్యాగింగ్‌ చేసిన మగ్గాలు 17,500).

కేంద్ర జౌళిశాఖ తెలిపిన ప్రకారం ఒక చేనేత మగ్గం నడిస్తే దాని మీద ముగ్గురు ఉపాధి పొందుతారు.ఈ ప్రకారం లెక్కిస్తే దీని ప్రకారం రాష్ట్రంలో 1,20,000 మందికి ఉపాధి పొందుతున్నారు. ప్రత్యక్షంగా, పరో క్షంగా చాలా మంది వ్యాపారస్తులు ఆధారపడి ఉన్నారు.

అంతేకా కుండా చేనేత అనుబంధ వృత్తులైన రంగుల అద్దకం, అచ్చులు అతకడం, డబ్బాలు తోడడం, కండెలు చుట్టడం మొదలైనవి చేస్తున్నవారు కూడా ఉన్నారు. రాష్ట్రంలో పెద్ద చేనేత కేంద్రాలైన నల్గొండజిల్లాలో పోచంపల్లి టై అండ్‌ డై రకం వస్త్రాలను దాదాపు 80 గ్రామాలు ఉత్పత్తి చేస్తున్నాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో గద్వాల్‌ చీరలు, నారాయణపేట చీరలు, మెదక్‌జిల్లాలో సిద్ధి పేటలోని గొల్లబామ చీరలు, కరీంనగర్‌ టవల్స్‌, బెడ్‌షీట్స్‌, లుంగీలు, దోతీలు, టస్సర్‌ పట్టుచీరలు, వరంగల్‌ డర్రీలు, మొద లైన రకాలు నేస్తున్నారు.

చేనేత వస్త్రాలు ఆయా ప్రాంతాలు గ్రామాల పేరుతో ప్రసిద్ధిచెందినవి. దేశంలోని హైదరాబాద్‌, ఢిల్లీ, కోల్‌కత్తా, చెన్నై, బెంగళూరు, బొంబాయిలతో పాటు అమెరికా, లండన్‌, బ్రిటన్‌వంటి అభివృద్ధిచెందిన దేశాలలో కూడా మన రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన పేర్లతో ఉన్న చేనేత రకాలు ఎగుమతి అవుతున్నాయి.

రాబోయే రోజుల్లో చేనేత కార్మికులు ఎక్కువస్థాయి లో ఆకలిచావ్ఞలు, ఆత్మహత్యలకు గురయ్యేఅవకాశం ఉంది. నోట్లరద్దు, జిఎస్టీ కారణంగా చేనేత వస్త్ర వ్యాపారరంగం మంద గించింది.

దీనికితోడు ఆర్థిక మందగమనం ఇప్పుడు అనుకోని ఉపద్రవం కరోనా మహమ్మారి చేనేత రంగాన్ని కబళిస్తుంది.

రాష్ట్రంలో 200 కోట్లకుపైగా విలువైన వస్త్రనిల్వలు పేరుకుపో యాయి. విక్రయించేందుకు అవకాశం లేకపోవడంతో నేతన్నలు ఉపాధి కోల్పోయి అల్లాడుతున్నారు.

మార్కెటింగ్‌వ్యవస్థ ఆగిపో వడంతో సరుకులు పేరుకుపోయి నిల్వచేసుకోవడానికి తగిన వసతి లేకపోవడంతో నేతన్నలు ఆందోళన చెందుతున్నారు.

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తామని శంకుస్థాపన చేసి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి లేకుండా శిలాఫలకాలకే పరిమితమై ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందాన రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తుంది.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చేనేత కార్మికుల వర్గం క్రియాశీలక పాత్ర పోషించింది.

ఆరుసార్లు శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టినా చేనేత రంగానికి నాలుగుసార్లు మొండిచెయ్యి చూపి ఒక్కరూపాయి కూడా బడ్జెట్‌లో కేటాయించలేదు.

2018- 19 సంవత్సరంలో 1285 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ దానిని అమలుపరచలేదు.

కేంద్రప్రభుత్వం చేనేత ఉత్పత్తులకు చేనేత గార్మెట్‌లపై,చేనేత వస్త్ర ఉత్పత్తులకు వాడే నూలు, రంగు, రసాయనాలపై పూర్తిస్థాయిలో జిఎస్టీ నుండి మినహాయించాలి.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత, జౌళి రంగాలను వేరు చేసి వేర్వే రు మంత్రిత్వశాఖలు ఏర్పాటు చేయాలి.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు నేరుగా లబ్ధిచేకూర్చే ప్రత్యేక ప్యాకేజీని ప్రక టించాలి. కేంద్ర,రాష్ట్రస్థాయిలో చేనేత కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి జియోట్యాగింగ్‌ ఉన్న ప్రతి చేనేత కార్మికునికి ప్రభుత్వం పని కల్పించాలి.

నెలకు 15వేల రూపాయల జీవన భృతి చెల్లించాలి. ఉపాధికి భరోసా ఇచ్చేందుకుగాను బతుకమ్మ చీరలు వంటి పథ కాలు చేనేత వృత్తిపై ఉన్న ప్రతిచోటుకు విస్తరించాలి.

లాక్‌డౌన్‌ వల్ల నష్టపోయిన చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం టెస్కో లేదా చేనేత కార్పొరేషన్‌ ద్వారా పనికల్పించాలి. రూ.కోట్ల విలు వైన చేనేత వస్త్ర నిల్వలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.

-డాక్టర్‌ చిక్కా దేవదాసు, (రచయిత: జాతీయ అధ్యక్షుడు, చేనేత వర్గాల చైతన్య వేదిక)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/