బ్యాంకులు రుణాలు ఇచ్చేనా?

పెరిగిన నగదు నిల్వల కొరత

Bank Loans
Bank Loans

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత విపత్కర పరిస్థితులతో అందరి జీవితాలు అతలాకుతలమై పోయాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. మాన్యుఫా క్చరింగ్‌ ఆగిపోయింది.

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్నవాళ్లు ”లాభాల కోసం ఆగొద్దు పెట్టిన పెట్టుబడి వచ్చినా ఫర్వాలేదు.. ఉన్నవాటిని వెంటనే ఏదోలా అమ్మేసుకోండి అంటూ ఆ రంగం లో ఉన్న ప్రఖ్యాత ఏజెన్సీలు నిర్మాణ సంస్థల్ని హెచ్చరిస్తు న్నాయి.

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ తరువాత మళ్లీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే కీలకమైంది బ్యాంకింగ్‌ రంగం. బ్యాంకులు మళ్లీ రుణాలు ఇస్తేనే అన్ని రంగాలూ మళ్లీ గాడిన పడతాయి. కొంచెం ఆలస్యమయినా తిరిగి పుంజుకుంటాయి.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల వద్ద సరిపడే నగదు నిల్వలు ఉన్నాయా? ఇంతకుముందులాగే రుణాలు ఇస్తాయా? అనేది ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న.

ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒకటుంది. నిజానికి బ్యాంకులు ఉన్న దే వ్యాపారం చేసుకోడానికి. లాభాలు గడించడానికి. అంతే కానీ ప్రజాసేవ చేయడానికి అవి స్వచ్ఛంద సేవా సంస్థలు కావు.

ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అం శం. అకస్మాత్తుగా వచ్చిపడ్డ కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలో ఉన్న పౌరులంతా ఎక్కడివారక్కడ ఇండ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. బయటకు వెళ్లే దారిలేదు. సంపాదించే అవకాశమూ లేదు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. నెలనెలా కట్టాల్సిన ఈఎం ఐలపై మూడు నెలల మారటోరియం విధించింది.

దీంతో అప్పు లిచ్చిన బ్యాంకులకు రావాల్సిన మొత్తాలు రాకుండా పోయాయి. ఈఎంఐలలో కొన్ని చెల్లింపులు జరిగినా దాదాపు 80 శాతం మేర కోత పడింది. ఇదే పరిస్థితి వచ్చే నెల చివరాఖరు వరకూ ఉండబోతోంది.

దీంతో సహజంగానే బ్యాంకుల వద్ద నగదు నిల్వల కొరత ఏర్పడింది. ఇప్పుడీ సమస్యే బ్యాంకులు రుణాలు ఇస్తాయా? లేదా? అనే కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

బ్యాంకులు ఎదుర్కొంటున్న నగదు నిల్వల సమస్యల్ని రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఎప్పుడో గుర్తించింది. నష్ట నివారణా చర్యల కోసం వెంటనే రంగంలోకి దిగింది.

దేశంలో నగదు లభ్యతను పెంచేందుకు వీలుగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రివర్స్‌ రేపో రేటును 25 బేసిక్‌ పాయింట్లు తగ్గించింది.

దీంతో రివర్స్‌ రేపో రేటు 4 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గిపోయింది.

బ్యాంకింగ్‌ సంస్థలు లిక్విడిటీ సమస్యను అధిగమించేందుకు లక్ష కోట్ల రూపాయల స్వల్పకాలిక రుణాలను 5.16% రేపో రేటుకే ఓపెన్‌ యాక్షన్‌ ద్వారా వాటికి అందించింది.

రానున్న రోజుల్లో కూడా బ్యాంకులకు లిక్విడిటీ సమస్య రాకుండా చూసుకునే పూచీ మాదీ అని ఆర్బీఐ హామీ ఇస్తోంది.

ఈ నేపథ్యంలో బ్యాంకులు రుణాలు ఇస్తాయా లేదా అనే మీమాంస అక్కర్లేదని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయప డుతున్నారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆర్బీఐ చర్యలతో బ్యాంకుల దగ్గర సరిపడే నగదు నిల్వలు సమకూరినా బ్యాంకులు మాత్రం రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయా? లేదా? అనేది ఒక ప్రశ్న.

ఎందుకంటే బ్యాంకులు ఇచ్చే రుణ మొత్తాలు అవి ఆయా బ్యాంకులకు సంబంధించిన సొంత డబ్బు. అదేమీ ప్రభుత్వ డబ్బు కాదు.

డిపాజిట్ల రూపంలోనో, బాండ్ల రూపంలోనో, ఆర్బీఐ దగ్గర తీసుకుంటున్న అప్పుల ద్వారానో లేదా మరే ఇతరత్రా మార్గాల ద్వారా బ్యాంకులు నిధుల్ని సేకరిం చుకుంటాయి.

సమీకరించుకున్న నిధులను ఇతరులకు రుణాలు ఇస్తూ వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి లేదా సంస్థకు రుణం ఇచ్చేముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి.

వందల పేజీల డాక్యుమెంట్లు, తగిన గ్యారెం టీలు దగ్గర పెట్టుకుంటాయి. రుణం ఎంతైనా కావొచ్చు.. అన్ని నమ్మకాలూ కుదిరాకే రుణం మంజూరు చేస్తాయి.

అయితే ప్రస్తు త విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక రంగం కుదేలవుతున్న నేపథ్యం లో ఎలాంటి నమ్మకాలు పెట్టుకుని రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది? అసలిస్తాయా? లేక కొంత కాలం పాటు కార్యకలా పాలు ఆపేస్తారా? అని నేనొక బ్యాంకింగ్‌ ఉన్నతాధికారిని అడిగాను.

అసలు రుణాలిస్తున్నారా? లేదా? అనే నా ప్రశ్నకు ఆయన ఇలా జవాబిచ్చారు.

”ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు ఇస్తూనే ఉన్నాం. అయితే లాక్‌ డౌన్‌ పూర్తయ్యేవరకు డాక్యుమెం టేషన్‌ కలెక్షన్‌ సమస్య ఉంటుంది

కాబట్టి, ప్రస్తుతానికైతే మా సొంత ఖాతాదారులకు మాత్రమే వ్యక్తిగత రుణాలు మంజూరు చేస్తున్నాం అని ఆయన చెప్పారు.

లాక్‌డౌన్‌ తరువాత బ్యాంకు లు రుణాలు ఇవ్వకపోవచ్చు అనే అనుమానాలను ఆయన కొట్టి పారేశారు.

గృహ, వాహన వంటి సెక్యూర్డ్‌ రుణాలకు ఇబ్బందే లేదని ఆయన చెబుతూనే ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు ఇస్తూ నే ఉంటామని వెల్లడించారు.

అయితే వ్యక్తిగత రుణాల్లో కొంత కాలంపాటు కేటగిరీ-1, కేటగిరి-2 లో ఉన్న సంస్థల ఉద్యోగు లకు మాత్రమే ప్రాధాన్యం ఉండే అవకాశం ఉందని, రుణ అర్హతలో కూడా కొంత కోత విధిస్తున్నామని ఆయన చెప్పారు.

అన్ని రకాల రుణాల్లో కొంత కాలంపాటు కొంచెం శాతం రుణ అర్హత తక్కువ తో ఎప్పట్లాగే రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి.

ఆర్థికశాఖ లెక్కల ప్రకారం జీడీపీని దృష్టిలో పెట్టుకుని అదే స్థాయిలో రుణాలు ఇవ్వాల్సి ఉండగా గడిచిన పదేళ్ల లెక్కల్ని తీసుకుంటే వీరి వాటాలో కేవలం 6 శాతం మాత్రమే బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి.

అయితే ఎంఎస్‌ఎంఈ లలో 90 శాతానికై పైగా ఏక యాజ మాన్య సంస్థలే (సింగిల్‌ ప్రొప్రయిటర్షిప్‌) ఉంటాయి.

అకస్మా త్తుగా వచ్చిపడ్డ కరోనా లాక్‌ డౌన్‌తో ఇలాంటి సంస్థల భవిషత్‌ అగమ్యగోచరంగా మారిపోయింది. ఆదుకునేవారు ఉండరు.

అప్పులు తీసుకుని సంస్థల్ని తిరిగి నిలబెట్టుకుందా మన్నా బ్యాం కులు సహకరించే పరిస్థితులు కనిపించవు.

ఇలాంటి సమస్యంతా ఒక్క మన దేశంలోనే కాదు. కరోనా నేపథ్యంలో అన్ని దేశాల్లో నూ కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఇలాంటి చిన్న సంస్థ ల్ని ఆదుకునేందుకు అక్కడి ప్రభుత్వాలు నడుం బిగించాయి.

సంస్థల అద్దెలు ప్రభుత్వాలే చెల్లిస్తున్నాయి. కరెంటు బిల్లుల్ని రద్దు చేసాయి. టాక్స్‌లకు మినహాయింపులు ఇచ్చాయి.

ఇలా ఎన్ని రకాలుగా సహకరించాలో అన్ని రకాలుగా సహకరిస్తున్నా యి. వీటన్నింటినీ మన దేశం కూడా దృష్టిలో పెట్టుకుంది.

మొత్తమ్మీద చూసుకుంటే కొత్తగా గృహ, వ్యక్తిగత, వ్యాపార తదితర బ్యాంకు రుణాల మంజూరు విషయంలో ఎవరూ పెద్దగా ఆందోళన చెందే పరిస్థి తులైతే లేవు కొంత కాలంపాటు తాత్కాలిక ఇబ్బంది తప్ప.

  • శ్రీనివాస్‌ గౌడ్‌ ముద్దం

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/