తెలంగాణ సూపర్‌వైజర్ గ్రేడ్-1 పోస్టుల ప్రైమరీ కీ విడుదల

తెలంగాణ సూపర్‌వైజర్ గ్రేడ్-1 పోస్టుల ప్రైమరీ కీ విడుదల చేసింది TSPSC . జనవరి 08 న సూపర్‌వైజర్ గ్రేడ్-1 రాత పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ప్రైమరీ కీని TSPSC ప్రకటించింది. కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రం, పరీక్షకు హాజరైన 33,405మంది అభ్యర్థుల OMR కాపీలను వైబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపింది. ఈ ప్రిలిమినరీ కీపై అభ్యర్థులు అభ్యంతరాలను ఈనెల 21 నుంచి 24 సాయంత్రం 5గంటల వరకు వెబ్సైట్లో ఇంగ్లీష్ నమోదు చేయాలని సూచించింది.
మహిళా, శిశు సంక్షేమ శాఖలో 181 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గ్రేడ్ -1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(సూపర్ వైజర్) పోస్టుల భర్తీ చేస్తోంది. అలాగే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు (టీఎస్పీఎస్సీ గ్రూప్ -1 రిజల్ట్స్ ) విడుదల చేయడం జరిగింది. శనివారం టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ఫలితాలను విడుదల చేసింది. దీంతో గ్రూప్ -1 ప్రిలిమినరీ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఒక రోజు ముందే సంక్రాంతి పండుగ చేసుకున్నారు. వచ్చే జూన్ లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.