పవన్‌ అన్‌స్టాపబుల్‌ టీజర్ వచ్చేసింది

నందమూరి అభిమానులు , మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసలైన పవర్ ప్యాక్ టీజర్ వచ్చేసింది. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ 2 కు సంబదించిన పవన్ కళ్యాణ్ టీజర్ వచ్చేసింది. అసలు ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండే పవన్‌ కళ్యాణ్‌ మొదటి సారి ఓ టాక్‌ షోకు.. అది కూడా బాలయ్య హోస్ట్‌ చేస్తున్న షోకు రావడం తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. వీరిద్ధరి మధ్య మాట, ముచ్చట ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆహా సంస్థ పవన్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసింది.

టీజర్‌ భీమ్లా నాయక్‌ సాంగ్‌తో స్టార్‌ అయ్యింది. అయితే.. ప్రేక్షక్షకుల స్వాగతంతో సెట్‌లోకి ఎంటరైన పవన్‌కు బాలయ్య తనదైన స్టైల్‌లో ప్రశ్నలు సంధించారు. తనను బాల అని పిలవచ్చంటూ బాలకృష్ణ అంటే.. తరువాత.. నేను ఓడిపోవడానికి సిద్ధం అంటుండగానే.. ఈ రాజకీయాలే వద్దంటూ బాలకృష్ణ చేసిన కామెంట్‌ ఆకర్షణగా మారాయి. అంతేకాకుండా.. పవన్‌ కల్యాణ్‌ను తన అన్న చిరంజీవి గురించి.. అలాగే గత ఎన్నికల్లో ఓడిపోవడం గురించి పలు ప్రశ్నలు సంధించారు బాలకృష్ణ. లాస్ట్‌లో 10 అంకెలు లెక్కబెట్టి.. మేము బ్యాండ్‌ బాయ్స్‌ అంటూ టీజర్‌ ముగించారు. టీజర్ మాత్రం ఎపిసోడ్ ఫై ఆసక్తి రెక్కిస్తుంది. మరి బాలయ్య ప్రశ్నలకు ..పవన్ ఎలా సమాధానం చెప్పారో తెలియాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.