మరోసారి టీఆర్ఎస్ పై ధ్వజమెత్తిన ఈటల

టికెట్ ఇచ్చినవాళ్లే ఓడించాలని చూశారని ఈటల ఆరోపణ

హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ నేత ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నేతలపై మరోసారి ధ్వజమెత్తారు. టికెట్ ఇచ్చిన వాళ్లే నన్ను ఓడించాలని చూశారని విమర్శించారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ నా ఇంటిపై పోలీసులతో దాడి చేయించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో రేషన్ కార్డు కూడా ఇవ్వలేని మంత్రి పదవి ఎందుకని భావించానని ఈటల వెల్లడించారు. గుట్టలు, ఉపయోగంలేని భూములు, రైతుబంధు… భూస్వాములకు ఇవ్వొద్దని చెప్పానని తెలిపారు. నాడు నోరు మూసుకుని ఉండుంటే నేడు తన పదవి ఎక్కడికీ పోయేది కాదని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/