కేసీఆర్ పాలన ఫై బండ్ల గణేష్ ప్రశంసలు

Bandla Ganesh praises KCR rule

Community-verified icon


క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిత్రసీమలో అడుగుపెట్టిన బండ్ల గణేష్..ఆతర్వాత నిర్మాతగా మరి పలు బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకొని బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉంటె తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఫై ప్రశంసలు కురిపించి వార్తల్లో నిలిచాడు.

తెలంగాణలో నీటి సమస్య లేకుండా.. కాళేశ్వరం ప్రాజెక్టు ను కట్టారని, దీంతో పంటలు విపరీతంగా పండుతున్నాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేయకుండా తెలంగాణ ప్రజలు ఉండలేరని , కేసీఆర్‌ సర్కార్‌ పాలన అద్భుతంగా ఉందని..అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ ఇస్తే తీసుకుంటారా? ఆయ‌న అలా ఇస్తే మినిష్ట‌ర్ కూడా అవుతారు క‌దా!’ అని అడిగిన ప్ర‌శ్న‌కు బండ్ల గణేష్ రియాక్ట్ అవుతూ ‘‘నాకు ఎమ్మెల్సీలు, రాజ్య‌స‌భ‌లు, ఎంపీలు వ‌ద్దు సార్‌. వార్డు మెంబ‌ర్‌గా జ‌నం ద‌య‌తో గెలిస్తే ఆ కిక్కే వేరు. ప్ర‌స్తుతం నేను రాజ‌కీయం అనే ప‌డ‌వ‌లో నేను. భ‌విష్య‌త్తులో రాజ‌కీయాల్లోకి వ‌స్తే అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటాను. అలాగే బొత్స స‌త్య‌నారాయ‌ణ‌గారి గురించి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారి గురించి నన్ను అడ‌గ‌కండి. ఎందుకంటే వారంటే నాకు ప్రేమ‌. నా ఫ్యామిలీని ప్రేమించిన‌ట్లే వారిని ప్రేమిస్తాను’’ అన్నారు బండ్ల గ‌ణేష్‌.

అలాగే ఆర్కే రోజాకు మంత్రి పదవి వచ్చినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. ఒక సినీ నటిగా ప్రయాణం ప్రారంభించి, రాజకీయాల్లో పోరాడారని గుర్తు చేశారు. రెండు సార్లు ఓడిపోయి, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు మంత్రి పదవి రావడం శుభపరిణామమని బండ్ల గణేష్ అన్నారు. మంత్రి పదవి చేపట్టిన రోజాను తెలుగు సినీ పరిశ్రమ సన్మానించాల్సిన అవసరం ఉందన్నారు. రోజాను సన్మానించే విషయమై సినీ పెద్దలు కూర్చొని త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రోజాను మంత్రిగా చూడటం చాలా ఆనందంగా అనిపిస్తోందన్నారు. ఆర్కే రోజాకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం జగన్‌కు బండ్ల గణేష్ ధన్యవాదాలు తెలిపారు.