సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన‌ పెద్దిరెడ్డి

పెద్దిరెడ్డి తనకు ఎంతో సన్నిహితుడన్న కేసీఆర్

హైదరాబాద్ : మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. పెద్దిరెడ్డితో పాటు కాంగ్రెస్ నేత స్వర్గం రవి కూడా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి హరీశ్ రావు, గంగుల, కొప్పుల, ఎల్.రమణ, బాల్క సుమన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి తనకు ఎంతో సన్నిహితుడని చెప్పారు. తాను, పెద్దరెడ్డి ఇద్దరూ ఒకే సమయంలో మంత్రులుగా పని చేశామని తెలిపారు. రైతుబంధు పథకం పక్కాగా అమలవుతోందని చెప్పారు. చేనేత కార్మికులకు రైతు బీమా తరహాలో సహాయం అందిస్తామని తెలిపారు. తెలంగాణను సాధించుకున్న తొలి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఉండేవని… వాటన్నింటినీ అధిగమించామని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/