మ‌హిళా ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం వెసులుబాటు రాజ‌స్ధాన్ ప్ర‌భుత్వం

rajasthan-govt-launches-work-from-home-scheme-for-women

జైపూర్ః రాజ‌స్ధాన్ ప్ర‌భుత్వం మ‌హిళా ఉద్యోగుల‌కు శుభవార్తను తెలిపింది.మ‌హిళా సాధికార‌త దిశ‌గా ప్ర‌భుత్వ శాఖ‌లు, ప్రైవేట్ సంస్ధ‌ల్లో ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగుల‌కు ఇంటి నుంచి ప‌నిచేసే వెసులుబాటును క‌ల్పించిన‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. గ‌త బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు వ‌ర్క్ ఫ్రం హోం అనుమ‌తిస్తామ‌ని రాజ‌స్దాన్ సీఎం అశోక్ గెహ్లోత్ ప్ర‌క‌టించారు.

సీఎం నిర్ణ‌యాన్ని అమ‌లు చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. జ‌నాధార్ కార్డు ద్వారా మ‌హిళ‌లు ఈ పోర్ట‌ల్‌లో పేరు న‌మోదు చేసుకోవ‌చ్చ‌ని అధికారులు తెలిపారు. వేత‌నం ఎంత ఇవ్వ‌ల‌నేది ఆయా డిపార్ట్‌మెంట్‌లు, సంస్ధ‌లు నిర్ణ‌యిస్తాయి. 20 శాతం మంది మ‌హిళ‌ల‌ను నియ‌మించుకున్న సంస్ధ‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్ధిక సహ‌క‌రాం అంద‌చేస్తుంది. ఈ ప‌ధ‌కానికి రాజ‌స్ధాన్ ప్ర‌భుత్వం రూ 100 కోట్ల కేటాయించింది. ఆరు నెల‌ల్లో 20,000 మంది మ‌హిళ‌ల‌కు ఉపాధి క‌ల్పించాల‌ని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. కాగా ఇప్ప‌టివ‌ర‌కూ 150 మంది మ‌హిళ‌లు, 9 కంపెనీలు ఈ వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్ అయ్యాయ‌ని అధికారులు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/